Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాధకి సినిమాల్లోకి రావాలని వుండేది కాదు: సీనియర్ హీరోయిన్ అంబిక

  • రాధకి టీచర్ కావాలని ఉండేది 
  • నా తరువాతే హీరోయిన్ గా వచ్చింది 
  • రాధ చాలా బాగా డాన్స్ చేస్తుంది
తెలుగు . . తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో అంబిక కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నా చెల్లెలు రాధకి మొదటి నుంచి కూడా సినిమాల్లోకి రావాలని ఉండేది కాదు. బాగా చదువుకుని టీచర్ ను అవుతానని అంటూ ఉండేది. ఈలోగా తెలుగులో నేను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను.

నా తరువాత వచ్చిన రాధ హీరోయిన్ గా దూసుకుపోయింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగా చేరువైంది. తెలుగు ప్రేక్షకులకు నేను అంతగా దగ్గర కాలేకపోయానే అనే ఫీలింగ్ నాకు ఉండేది. అయితే అసూయ మాత్రం వుండేది కాదు. పేరు .. డబ్బు నాకు వస్తే ఏంటి? రాధకు వస్తే ఏంటి? అనుకునే దానిని. ఒక విషయంలో మాత్రం అసూయ పడేదానిని .. అదీ రాధ డాన్స్ విషయంలో. రాధ చాలా బాగా డాన్స్ చేస్తుంది .. తాను టాప్ టెన్ లో ఉండేది" అంటూ చెప్పుకొచ్చారు.    
ambika
radha

More Telugu News